‘వకీల్‌ సాబ్‌’ వచ్చే వేళయింది - vakeel saab the power is set to unleash on the big screen
close
Updated : 30/01/2021 19:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌ సాబ్‌’ వచ్చే వేళయింది

హైదరాబాద్‌: ఈ ఏడాది సినీ ప్రియులకు మరో పెద్ద తీపి కబురు వినిపించింది. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ నటించిన ‘వకీల్‌ సాబ్‌’ విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించింది. వేసవి కానుకగా ఏప్రిల్‌ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని చిత్రనిర్మాణ సంస్థ స్వయంగా ప్రకటించింది. దీంతో పవర్‌స్టార్‌ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి. రాజకీయాల కారణంగా చాలాకాలం పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు పవర్‌స్టార్‌. ‘వకీల్‌సాబ్‌’తో మళ్లీ రీఎంట్రీ ఇవ్వనుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

ఇప్పటికే విడుదలైన పాట, టీజర్‌ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు..’ అంటూ సినిమాలో వినోదం ఏ స్థాయిలో ఉండబోతోందన్నది రుచి చూపించారు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. పవన్‌ సరసన శ్రుతిహాసన్‌ నటించింది. తమన్‌ సంగీతం అందించారు. హిందీలో మంచి విజయం సాధించిన పింక్‌ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి..

#NTR30: హీరోయిన్‌ ఈమేనా?
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని