నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..! - vakeel sab dialouge promos
close
Updated : 12/04/2021 08:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఇటీవలే విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతున్న నేపథ్యంలో సినీ అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది చిత్రబృందం. ఈ సినిమాలో పవన్‌ చెప్పిన పవర్‌ఫుల్‌ సంభాషణల్ని ప్రోమో రూపంలో విడుదల చేసింది. ‘నిజం ఎప్పుడూ ఒంటరిదే నందా. కానీ, దాని బలం ముందు ఎవరైనా తలొగ్గాల్సిందే’, ‘ఆడదంటే వాడి బాత్‌రూమ్‌లో గోడమీద ఉండే బొమ్మ కాదు.. వాడ్ని కనిపెంచిన అమ్మ కూడా’ అంటూ పవన్‌ పలికిన తీరు భావోద్వేగానికి గురి చేస్తుంది.

హిందీ చిత్రం ‘పింక్‌’ రీమేక్‌గా కొన్ని మార్పులు చేసి ‘వకీల్‌ సాబ్‌’ తెరకెక్కించారు శ్రీరామ్‌ వేణు. ప్రకాశ్‌ రాజ్‌, శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషించారు. తమన్‌ సంగీతం అందించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పించారు. 


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని