‘వకీల్‌ సాబ్‌’ ప్రేమ గీతం వచ్చేసింది - vakeel sab kantipapa kantipapa song
close
Published : 17/03/2021 18:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌ సాబ్‌’ ప్రేమ గీతం వచ్చేసింది

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎప్పుడెప్పుడా సినీ అభిమానులు ఎదురుచూస్తున్న ‘వకీల్‌ సాబ్‌’ చిత్రంలోని మూడో పాట వచ్చేసింది. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. శ్రుతి హాసన్‌, అంజలి, నివేదా థామస్‌, అనన్య కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘కంటిపాపా కంటిపాపా’ అనే మెలోడీని తాజాగా విడుదల చేసింది చిత్ర బృందం.  రామజోగయ్య శాస్త్రి సాహిత్యం అందించిన ఈ గీతాన్ని అర్మాన్‌ మాలిక్‌, దీపు, తమన్‌ ఆలపించారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు.

హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా రూపొందుతుంది ఈ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ సమర్పిస్తున్నారు. ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’ పాటలు, టీజర్‌ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని