పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు - vakeel sab success meet
close
Published : 09/04/2021 22:33 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌ చూసి నిర్మాతనని మర్చిపోయా: దిల్‌ రాజు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పంపిణీదారుడిగా, నిర్మాతగా నా కెరీర్‌లో ఎన్నో విజయాలు చూశా. కానీ, ఈ రోజు పొందిన అనుభూతి ఎన్నడూ లేదు’ అని అన్నారు నిర్మాత దిల్‌ రాజు. పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా ఆయన నిర్మించిన ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం విడుదలై అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ నేపథ్యంలో సక్సెస్‌ మీట్‌ ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడారు. ‘పంపిణీ దారుడిగా, నిర్మాతగా నా జీవితంలో ఎన్నో విజయాలు చూశా. కానీ, ఈ రోజు పొందిన అనుభూతి ఎప్పుడూ పొందలేదు. ‘వకీల్‌ సాబ్‌’ని చూసేందుకు ఉదయం 4గం.లకి ప్రీమియర్‌ షోకి వెళ్లాను. తెరపై పవన్‌ని చూడగానే నిర్మాతననే విషయం మర్చిపోయి, సగటు ప్రేక్షకుడిగా సినిమాని ఆనందిస్తూ కాగితాలు ఎగరేశాను. ప్రతి థియేటర్‌లోనూ ప్రేక్షకుల స్పందనని ప్రత్యక్షంగా చూసి కొత్త అనుభూతికి లోనయ్యా. సినిమా చూసిన వెంటనే దర్శకుడు శ్రీరామ్‌ వేణుకి ఫోన్‌ చేసి, పవన్‌ కల్యాణ్‌ గారిని కలుద్దాం రమ్మని చెప్పాను. పవన్ గారిని కలిసి దాదాపు ఆయనతో దాదాపు 45 నిమిషాలు మాట్లాడాం. సినిమా విజయంతోపాటు ఆయనతో ముచ్చటించిన సమయం మరిచిపోలేనిది. 18 సంవత్సరాలుగా మా సంస్థలో పనిచేస్తూ ఇలాంటి అనుభూతిని నాకు పంచినందుకు దర్శకుడు వేణుకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అన్నారు.

‘తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ ‘వకీల్ సాబ్‌’కి మంచి ఆదరణ లభిస్తుంది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈ చిత్రం అలరిస్తుంది. విజయాన్ని అందించిన అందరికీ ధన్యవాదాలు. ఇదంతా చిత్ర బృందం సహకారం వల్లే సాధ్యమైంది. అలాంటి టీమ్‌ని ఇచ్చిన నిర్మాత దిల్‌ రాజుగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా’ అన్నారు దర్శకుడు శ్రీరామ్‌ వేణు. అనంతరం దర్శకుడు వేణుని సత్కరించారు దిల్‌ రాజు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని