vakeelsaab: సత్యమేవ జయతే ఫుల్‌ సాంగ్‌ - vakeelsaab​ sathyameva jayathe full video song
close
Published : 22/05/2021 01:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

vakeelsaab: సత్యమేవ జయతే ఫుల్‌ సాంగ్‌

ఇంటర్నెట్‌ డెస్క్:  పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. ఏప్రిల్‌ 9న సినిమా విడుదలై ప్రేక్షకుల్ని మెప్పించింది. తాజాగా ఈ చిత్రంలోని ‘సత్యమేవ జయతే’ ఫుల్‌ వీడియో సాంగ్‌ని నిర్మాణ సంస్థ విడుదల చేసింది. ఈ పాటని రామజోగయ్య శాస్త్రి రచించగా తమన్‌ స్వరాలు సమకూర్చారు. శంకర్‌ మహదేవన్‌, పృథ్వీ చంద్ర, తమన్‌లు ఆలపించారు. హిందీలో వచ్చిన ‘పింక్‌’ సినిమాకు ఇది రీమేక్‌గా రూపొందింది. పవన్  న్యాయవాది సత్యదేవ్‌ పాత్రలో నటించగా ఆయన భార్యగా శ్రుతి హాసన్‌ నటించింది. నివేదా థామస్‌, అంజలి, అనన్య కీలక పాత్రలు పోషించి మెప్పించారు. ప్రకాష్‌రాజ్‌ అడ్వకేట్ నందగోపాల్‌గా మెప్పించారు. బోనీ కపూర్‌ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. పీఎస్‌ వినోద్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు. సినిమా అమెజాన్‌ ప్రైమ్ వీడియో ఓటీటీ వేదికగా ఏప్రిల్ 30న విడుదలై అభిమానుల్ని ఆకట్టుకుంది. 
 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని