‘వకీల్‌సాబ్‌’.. మరో పాట ఎప్పుడంటే - vakeelsab third song update
close
Published : 15/03/2021 18:14 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘వకీల్‌సాబ్‌’.. మరో పాట ఎప్పుడంటే

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌ హీరోగా వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. శ్రుతి హాసన్‌, అంజలి, అనన్య, నివేదా థామస్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఓ అప్‌డేట్‌ ఇచ్చింది చిత్ర బృందం. ఈ సినిమాలోని మూడో పాటని (లిరిలక్‌ వీడియో) మార్చి 17న సాయంత్రం 5గం.లకు విడుదల చేస్తున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు దర్శక-నిర్మాతలు. ‘కంటి పాప.. కంటి పాప..’ అంటూ సాగే గీతానికి సంబంధించి వీడియోను పంచుకున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మగువా మగువా’, ‘సత్యమేవ జయతే’ శ్రోతల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. దిల్‌ రాజు, బోనీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ సినిమాకు రీమేక్‌గా రూపొందుతోంది ఈ చిత్రం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని