Vakeelsaab: ఓటీటీలో పవన్‌ చిత్రం - vakeelsab on ott
close
Published : 27/04/2021 16:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vakeelsaab: ఓటీటీలో పవన్‌ చిత్రం

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల థియేటర్లలో విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందిన చిత్రం ‘వకీల్‌సాబ్’. ఇప్పుడు డిజిటల్‌ మాధ్యమంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో ఏప్రిల్‌ 30 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ మేరకు అమెజాన్‌ ప్రైమ్‌ ఇండియా ట్వీట్‌ చేసింది. హిందీలో విజయవంతమైన ‘పింక్‌’ రీమేక్‌గా శ్రీరామ్‌ వేణు ‘వకీల్‌సాబ్‌’ను తెరకెక్కించారు. సత్యదేవ్‌గా లాయరు పాత్రలో అదరగొట్టారు పవన్ కల్యాణ్‌. ప్రకాశ్‌ రాజ్‌, అంజలి, నివేదా థామస్, అనన్య, శ్రుతి హాసన్‌ కీలక పాత్రలు పోషించారు. దిల్‌ రాజు నిర్మించిన ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించారు.

‘వకీల్‌సాబ్’ను ఓటీటీలో విడుదల చేసే విషయంలో అనేక వార్తలు వచ్చాయి. చిత్ర నిర్మాణ సంస్థ వాటన్నింటినీ ఖండించింది. అయితే, ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతంగా ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లను మూసివేశారు. దీంతో పవన్‌ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సినిమాకు సంబంధించిన కొత్త ట్రైలర్‌ను విడుదల చేసింది.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని