అజిత్‌ అభిమానులకు నిరాశే - valimai firstlook release postponed due to covid
close
Published : 24/04/2021 14:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

అజిత్‌ అభిమానులకు నిరాశే

వాయిదాల బాట పడుతోన్న చిత్రబృందాలు

చెన్నై: దేశవ్యాప్తంగా కొవిడ్‌ రెండోదశ విలయతాండవం చేస్తోన్న తరుణంలో సినీ పరిశ్రమలో మరోసారి వాయిదాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే పలు సినిమా షూటింగ్స్‌, విడుదలలు వాయిదా వేశారు. మరోవైపు మరికొన్ని చిత్రాలు అప్రమత్తత, జాగ్రత్తల నడుమ షూటింగ్స్‌ని కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలోనే అజిత్‌ అభిమానులకు నిరాశ కలిగించే ఓ ప్రకటన బయటకు వచ్చింది.

అజిత్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘వలిమై’. సూపర్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ కోసం అభిమానులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అజిత్‌ పుట్టినరోజుని పురస్కరించుకుని మే 1న ‘వలిమై’ ఫస్ట్‌లుక్‌ని విడుదల చేస్తానని అప్పట్లో చిత్రబృందం ప్రకటించింది. కాగా, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ‘వలిమై’ ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ఓ ప్రకటన విడుదల చేసింది. త్వరలోనే ఫస్ట్‌లుక్‌ విడుదల తేదీని ప్రకటిస్తామని పేర్కొంది.

‘గని’ కూడా.. వరుణ్‌తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘గని’ చిత్రీకరణ నిలిచిపోయింది. వైరస్‌ విజృంభణతో కొంతకాలంపాటు షూట్‌ను వాయిదా వేస్తున్నట్లు వరుణ్‌తేజ్‌ తెలియజేశారు. పరిస్థితులు కొంతమేర చక్కబడితే  త్వరలోనే సెట్‌లోకి తిరిగి అడుగుపెడతామని ఆయన అన్నారు. బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కిరణ్‌ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సయీ మంజ్రేకర్‌ కథానాయిక. ఉపేంద్ర, సునీల్‌శెట్టి కీలకపాత్రలు పోషిస్తున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని