తమిళ స్టార్‌ హీరోతో టాలీవుడ్‌ డైరెక్టర్‌..! - vamshi paidipally to direct thalapathy vijay
close
Published : 03/05/2021 18:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తమిళ స్టార్‌ హీరోతో టాలీవుడ్‌ డైరెక్టర్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకరు ఇటీవల ‘మహర్షి’ చిత్రంతో జాతీయ పురస్కారం అందుకున్న డైరెక్టర్‌ వంశీ పైడిపల్లి.. మరొకరు ‘మాస్టర్‌’తో బ్లాక్‌బస్టర్‌ కొట్టిన కథనాయకుడు తమిళ స్టార్‌ హీరో విజయ్‌. వీరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే ఎలా ఉంటుంది..? ఇప్పుడు ఇటు టీ-టౌన్‌తో పాటు కోలీవుడ్‌లోనూ ఇదే హాట్‌ టాపిక్‌. ఈ సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌, హీరోల కాంబినేషన్‌లో ఒక చిత్రం రాబోతోందట. అది కూడా తెలుగు చిత్రమని సమాచారం. నేషనల్‌ అవార్డు చిత్రం తర్వాత వంశీ పైడిపల్లి మరో సినిమా చేయలేదు.. చాలాకాలం విరామం తర్వాత వస్తున్న చిత్రం కావడం.. అదీ దక్షిణాదిన మంచి ఆదరణ ఉన్న హీరో విజయ్‌తో కలిసి చేయనుండటంతో ఆసక్తి రెట్టింపవుతోంది. ఇప్పటికే వంశీ చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమాకు విజయ్‌ సంతకం కూడా చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ ఈ కాంబినేషన్‌లో సినిమా ఖరారు అయితే మాత్రం ఇక సినీ అభిమానులకు పండగే అనడంలో సందేహం అనవసరం.

తమిళంలోనే కాకుండా.. తెలుగులోనూ విజయ్‌కి మంచి స్టార్‌డమ్‌ ఉంది. మాస్టర్‌, తుపాకీ, పోలీసోడు, స్నేహితుడు, అదిరింది, సర్కారు వంటి సినిమాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఆయన నటించిన ‘మాస్టర్‌’ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు బద్దలు కొట్టింది. ప్రస్తుతం విజయ్‌ తన 65వ చిత్రంలో బిజీగా ఉన్నారు. జార్జియాలో చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఆ చిత్రాన్ని నెల్సన్‌ దిలీప్‌కుమార్‌ తెరకెక్కిస్తున్నారు. పూజా హెగ్డే కథానాయిక. అనిరుధ్‌ రవిచందర్‌ సంగీతం అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. ఇటీవల ‘వకీల్‌సాబ్‌’తో మంచి హిట్‌ అందుకున్న పవన్‌ కల్యాణ్‌ హీరోగా వంశీ పైడిపల్లి ఒక సినిమా చేయబోతున్నట్లు సినీవర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఆ చిత్రానికి సంబంధించి ఇప్పటికే నిర్మాత దిల్‌రాజుకు కథ వినిపించగా ఆయన ఓకే అన్నారట. ప్రస్తుతం కరోనా సోకడంతో క్వారంటైన్‌లో ఉన్న పవన్‌ కల్యాణ్‌ కోలుకున్న తర్వాత కథ విననున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ వార్తలన్నింటిలో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటనలు వచ్చే వరకూ వేచి చూడాల్సిందే.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని