తోడేలులా వరుణ్‌ధావన్‌! - varun bhediya will come on this summer
close
Published : 23/02/2021 12:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తోడేలులా వరుణ్‌ధావన్‌!

ముంబయి: బాలీవుడ్‌ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘భేదియా’ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. వరుణ్‌  ధావన్‌, కృతిసనన్‌ నటించిన ఈ సినిమాను హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించి మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో వరుణ్‌ధావన్‌  తోడేలులా మారుతున్నట్లు చూపించారు.

ఈ చిత్రం ఏప్రిల్‌ 14న వేసవిలో థియేటర్లకు వస్తోంది. వరుణ్‌ధావన్‌, కృతిసనన్‌ కలిసి నటిస్తున్న రెండో చిత్రమిది. దీన్ని అమర్‌కౌశిక్‌   తెరకెక్కిస్తున్నారు. ‘ఈ     సంతోషాన్ని అభిమానులతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరో కొత్త చిత్రంతో మీ ముందుకు వస్తున్నాం’ అంటూ కృతిసనన్‌ పేర్కొంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని