వరుణ్‌ కొత్త చిత్రం ఆ దర్శకుడితోనేనా? - varun tej green signal to praveen sattaru script
close
Published : 01/02/2021 13:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌ కొత్త చిత్రం ఆ దర్శకుడితోనేనా?

హైదరాబాద్‌: తొలి నుంచి వైవిధ్యమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌. ప్రస్తుతం బాక్సింగ్‌ నేపథ్యంలో ‘గని’లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కిరణ్‌ కొర్రపాటి దర్శకుడు. దీని తర్వాత వరుణ్‌ చేయబోయే చిత్రం ఖరారైందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు.

‘చందమామ కథలు’, ‘గరుడవేగ’ తదితర చిత్రాలతో సత్తా చాటిన ప్రవీణ్‌ సత్తారు. ఆయన దర్శకత్వంలో వరుణ్‌ నటించనున్నారని తెలుగు సినిమా వర్గాలు అంటున్నాయి. ఇటీవల కథ  వినిపించగా, ఆయన పచ్చజెండా ఊపినట్టు సమాచారం. త్వరలోనే ఆ చిత్రం పట్టాలెక్కనున్నట్టు తెలుస్తోంది. నాగార్జునతోనూ ఓ చిత్రం చేయబోతున్నారు ప్రవీణ్‌ సత్తారు.

ఇదీ చదవండి..

సోనూ షో ఆఫ్‌.. నాగబాబు గీసిన బొమ్మమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని