నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు - varun tej lifts niharika during the pre wedding celebration in Udaipur
close
Published : 08/12/2020 15:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నిహారిక సంగీత్‌.. వైరల్‌ వీడియోలు

చెల్లిని భుజాలపై మోసిన వరుణ్‌తేజ్‌

హైదరాబాద్‌: మెగా వారసురాలు నిహారిక పెళ్లి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోగల ఉదయ్‌ విలాస్‌లో కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య సంబరాలు జరుగుతున్నాయి. వివాహానికి ముందు జరిగే వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి సంగీత్‌ ఏర్పాటు చేశారు. కాబోయే దంపతులతో కలిసి రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌ తదితరులు చిందేశారు. తెలుగు పాటలతో ఉదయ్‌ విలాస్‌ హోటల్‌లో సందడి వాతావరణం నెలకొంది. తొలుత కటౌట్‌ గౌనులో మెరిసిన నిహారిక ఆపై ఎరుపు రంగు స్కట్‌లో తళుక్కుమన్నారు. కాబోయే భర్త చైతన్యతో కలిసి పెదనాన్న చిరంజీవి పాటలకు స్టెప్పులేశారు.

తన చిట్టి చెల్లెల్ని అన్నయ్య వరుణ్ తేజ్‌ భుజాలపై మోసిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మామయ్య నాగబాబుతో కలిసి అల్లు అర్జున్‌ హంగామా చేస్తున్న మరో వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. వధూవరులు ‘బాయ్స్‌’ సినిమాలోని ‘అలే అలే..’ పాటకు హుషారుగా డ్యాన్స్‌ చేస్తున్న వీడియో కూడా చక్కర్లు కొడుతోంది.

ప్రీ-వెడ్డింగ్‌ కార్యక్రమాల్లో భాగంగా మంగళవారం మెహందీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిసింది. బుధవారం సాయంత్రం 7 గంటల 30 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడుముళ్లు వేయబోతున్నారు.

ఇవీ చదవండి..
నిహారిక-చైతన్య వివాహం: చిరు అపురూప చిత్రం
నిహారిక పెళ్లి కూతురాయనే..
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని