వరుణ్‌తేజ్‌కు కరోనా నెగెటివ్‌ - varun tej tested corona negative
close
Published : 07/01/2021 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వరుణ్‌తేజ్‌కు కరోనా నెగెటివ్‌

హైదరాబాద్‌: యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌ కరోనా నుంచి కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. తాజాగా చేసిన పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చినట్లు తెలిపారు.

‘నెగెటివ్‌ అని వచ్చే రిపోర్ట్‌ ఇంత సంతోషాన్ని ఇస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. అవును నాకు కరోనా నెగెటివ్‌. మీ ప్రేమ, ప్రార్థనలకు కృతజ్ఞతలు’ -ట్విటర్‌లో వరుణ్‌తేజ్‌

ప్రస్తుతం వరుణ్‌తేజ్‌ బాక్సింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. దీంతో పాటు, వెంకటేశ్‌తో కలిసి అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్‌3’లో కూడా సందడి చేయనున్నారు. ఇటీవలే ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లింది.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని