సల్మాన్‌తో వరుణ్‌ స్టెప్పులు - varundhavan dance with salman
close
Published : 10/01/2021 16:46 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సల్మాన్‌తో వరుణ్‌ స్టెప్పులు

ఓ కథానాయకుడి సినిమాలో మరో కథానాయకుడు అతిథిగా మెరవడం సినిమాకు అదనపు ఆకర్షణ. ఇలాంటి విషయాల్లో సల్మాన్‌ఖాన్‌ ముందే ఉంటాడు. పలు చిత్రాల్లో అతిథి పాత్రల్లో మెరిశాడు. వరుణ్‌ధావన్‌ హీరోగా నటించిన ‘జుడ్వా’లో గెస్ట్‌రోల్‌ చేశాడు సల్మాన్‌. ఇప్పుడు సల్మాన్‌ చిత్రంలో వరుణ్‌ సందడి చేయబోతున్నాడు. తన బావమరిది ఆయుష్‌ శర్మతో  కలిసి సల్మాన్‌ నటిస్తున్న చిత్రం ‘అంతిమ్‌’. మహేష్‌ మంజ్రేకర్‌ దర్శకత్వంలో వస్తోన్న ఈ చిత్రంలో సల్మాన్‌ ఓ సిక్కు పోలీస్‌గా కనిపించబోతున్నాడు.

ఇందులో ఓ హుషారైన గీతం ఉందట. అందులో మరో హీరో స్టెప్పేస్తే బాగుంటుందనే ఆలోచనలో భాగంగా వరుణ్‌ పేరుని సూచించాడట సల్మాన్‌. వరుణ్‌ కూడా వెంటనే కాల్షీట్లు కేటాయించేశాడట. ఈ పాటనడీ ఈ నెల్లోనే తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది పూర్తయ్యాకా షారుఖ్‌ ఖాన్‌ ‘పఠాన్‌’లోని అతిథి పాత్రలో నటించడానికి దుబాయ్‌కి షూటింగ్‌కి వెళ్లనున్నాడు సల్మాన్‌. వరుణ్‌ ప్రస్తుతం ‘జుగ్‌ జుగ్‌ జీయో’, ‘బేడియా’ చిత్రాల్లో నటిస్తున్నాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని