రెండున్నర కోట్లమంది కోసం - vasundhara
close
Published : 22/02/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రెండున్నర కోట్లమంది కోసం

టా రెండున్నర కోట్లమంది అమ్మాయిలు.. నెలసరి సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక బడి మానేస్తున్నారంటే ఆశ్చర్యంగానే ఉంటుంది. దీనికి తోడు కొవిడ్‌ ఆడపిల్లల్ని చదువుల్లో మరింత వెనక్కినెట్టే ప్రయత్నం చేసిందని తాజా యునెస్కో అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా సుమారు 74 కోట్లమంది అమ్మాయిలు కొవిడ్‌ కారణంగా చదువుకు దూరమయ్యారట. ఈ పరిస్థితులని చక్కదిద్దేందుకు కీప్‌గాళ్స్‌ఇన్‌స్కూల్‌ అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రచారాన్ని మొదలుపెట్టింది యునెస్కో. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటి భూమీఫడ్నేకర్‌ తన వంతు మద్దతునిస్తోంది. ‘మనదేశంలో 71 శాతం మంది ఆడపిల్లలకు మొదటిసారి నెలసరి వచ్చేంతవరకూ... దాని గురించి అవగాహనే ఉండదు. దాంతో గ్రామీణ ప్రాంతపు ఆడపిల్లలు నెలసరి సమస్యలని ఎలా ఎదుర్కోవాలో తెలియక, రుతుస్రావం అవుతున్నప్పుడు శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం ఎలాగో తెలియక బడి మానేస్తున్నారు. ఒక వేళ వాళ్లు బడికి వెళ్తే అందులో ఎంతమంది అమ్మాయిలు పైలట్లు, డాక్టర్లు అవుతారో మనకు తెలియదు. అంతెందుకు నేనే కనుక పీరియడ్స్‌ కారణంగా బడి మానేసి ఉంటే ఇక్కడ ఉండేదాన్నా? అందుకే ఆడపిల్లల్లో నెలసరిపై అవగాహన తీసుకురావడం నా బాధ్యత అనిపించింది’ అంటుంది భూమి.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని