కాస్త బుజ్జగించి చెప్పండిలా... - vasundhara
close
Published : 22/02/2021 01:12 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాస్త బుజ్జగించి చెప్పండిలా...

మన బుజ్జి బంగారాలను ఎంతో అపురూపంగా పెంచుతుంటాం. అయితే గారం మరీ ఎక్కువై వాళ్లు విపరీతంగా అల్లరి చేస్తుంటే... ఏం చేయాలో అర్థంకాదు. ఇలాంటి పరిస్థితుల్లో అమ్మగా మీరేం చేయాలంటే...
కొట్టకూడదు... క్రమశిక్షణతో పెంచాలనే ఉద్దేశంతో పిల్లలను కొట్టకూడదు. ఇలాచేస్తే మరీ మొండిగా తయారవుతారు. ప్రతి చిన్న విషయానికీ పేచీ పెట్టడం మొదలుపెడతారు. మీరు ‘వద్దు, కాదు’ అని చెప్పినప్పుడల్లా అదే చేస్తానని మారాం చేస్తారు. అలాకాకూడదంటే.. ఆ పని చేయడం వల్ల కలిగే నష్టాలను చిన్నారులకు అర్థమయ్యేలా కాస్త సహనంతో వివరించాలి.
నియంత్రించాలని చూడొద్దు: పిల్లల ప్రవర్తనను పెద్దవాళ్లు నియంత్రించాలని చూస్తుంటారు. అలాగే వారి ఆలోచనలనూ నియంత్రిస్తుంటారు. ఇలా చేయడం చిన్నారుల మానసిక ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. అలాకాకూడదంటే వాళ్లను స్వేచ్ఛగా ఆలోచించనివ్వాలి. అలాగే వారి ఆలోచనలనూ మీతో పంచుకోనివ్వాలి.
ఇష్టంలేకపోయినా సరే: చిన్నారులు తమ తోబుట్టువులు లేదా స్నేహితుల మీద ఒక్కోసారి అయిష్టతను ప్రదర్శిస్తుంటారు. అప్పుడప్పుడూ వాళ్లతో పోట్లాడుతుంటారు కూడా. ఇలాంటప్పుడు మనకు ఇష్టం లేకపోయినా ఎదుటివాళ్లను ఏం అనకూడదనే విషయాన్ని కాస్త వివరంగా చెప్పాలి.
ప్రశంసించాలి: చిన్నారులు పరిస్థితులను అర్థం చేసుకుని ప్రవర్తించినప్పుడు వాళ్లను తప్పకుండా ప్రశంసించాలి. అలాగే అసహనంతో కారణం లేకుండా పిల్లలను కోప్పడితే వెంటనే వాళ్లకు సారీ చెప్పేయాలి. ఇలాచేయడం వల్ల తప్పుచేస్తే మన్నించమని అడగాలనే విషయం వాళ్లకు తెలుస్తుంది.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని