Veda Krishnamurthy: లీసా విమర్శించిన కొద్ది రోజులకే.. - veda krishnamurthy thanks bcci and secretary jai shah for extending support on her mother and sister loss due to corona
close
Published : 18/05/2021 22:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Veda Krishnamurthy: లీసా విమర్శించిన కొద్ది రోజులకే..

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి మంగళవారం బీసీసీఐ, సెక్రటరీ జైషాకు ధన్యవాదాలు తెలిపింది. కరోనా వైరస్‌ కారణంగా గత నెల తల్లిని కోల్పోయిన ఆమె రెండు వారాల తర్వాత సోదరిని కూడా కోల్పోయిన సంగతి తెలిసిందే. అయితే, ఒక మహిళా క్రికెటర్‌ ఇంతటి దుఖఃసాగరంలో ఉన్నా బీసీసీఐ కనీసం పలకరించలేదని, కష్ట సమయంలో అండగా నిలవలేదని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ లీసా స్థాలేకర్‌ గతవారం విమర్శలు గుప్పించింది. ఈ నేపథ్యంలోనే వేదా కొద్దిసేపటి క్రితం ఓ ట్వీట్‌ చేసింది.

‘గతనెలలో నాకూ, నా కుటుంబానికి చాలా కష్టంగా గడిచింది. అయితే, కొన్ని రోజుల క్రితం బీసీసీఐ సెక్రటరీ జైషా నాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో అండగా నిలిచారు. అందుకు ఆయనకూ, బీసీసీఐ, మహిళల బీసీసీకు ధన్యవాదాలు’ అని వేదా పేర్కొంది. ఇదిలా ఉండగా, వచ్చేనెల ఇంగ్లాండ్‌ పర్యటనలో మహిళల టెస్టు, వన్డే సిరీస్‌ కోసం బీసీసీఐ గతవారం ఒక జాబితా విడుదల చేసింది. అందరూ ఊహించినట్లే అందులో వేదా పేరు లేకపోవడం గమనార్హం.

ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ లీసా ఓ ట్వీట్‌ చేస్తూ బీసీసీని తప్పబట్టింది. ‘వచ్చేనెల పర్యటనకు వేదాను ఎంపికచేయకపోవడం బీసీసీఐ కోణంలో సహేతుక నిర్ణయమే అయినా, ఆ జట్టు యాజమాన్యం తీరు అస్సలు నచ్చలేదు. తల్లి, సోదరిని కోల్పోయిన ఒక కాంట్రాక్ట్‌ ప్లేయర్‌తో కనీసం ఫోన్‌ చేసి పలకరించలేదు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వేదా ఎలా కోలుకుంటుందని కూడా వాకబు చేయలేదు. నిజమైన జట్టు యాజమాన్యం క్రికెటర్ల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కేవలం ఆటల మీద మాత్రమే దృష్టిసారించకూడదు’ అని లీసా తీవ్రంగా మండిపడింది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని