Venkatesh: ఓటీటీలో ‘నారప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - venkatesh naarappa to release on amazon prime on july 20
close
Updated : 12/07/2021 16:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Venkatesh: ఓటీటీలో ‘నారప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హైదరాబాద్‌: వెంకటేశ్‌ కీలక పాత్రలో శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నారప్ప’. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందింది. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, రావు రమేశ్‌, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. కాగా, ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. జులై 20న ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా ‘నారప్ప’ స్ట్రీమింగ్‌ కానుంది. తొలుత థియేటర్‌లోనే సినిమాను విడుదల చేయాలని నిర్ణయించినా, కరోనా కారణంగా అది వాయిదా పడింది. దీంతో చిత్ర బృందం ఓటీటీవైపే మొగ్గు చూపింది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌ థాను నిర్మిస్తున్నారు.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని