venkatesh: రెండు సినిమాలు రూ.75కోట్లు? - venkatesh narappa and drushyam2 movies get huge profit
close
Published : 14/07/2021 01:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

venkatesh: రెండు సినిమాలు రూ.75కోట్లు?

ఇంటర్నెట్‌డెస్క్‌: వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు అగ్ర కథానాయకుడు వెంకటేశ్‌. ‘నారప్ప’, ‘దృశ్యం2’ చిత్రీకరణ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమయ్యాయి. ‘నారప్ప’ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా జులై 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలుత ఈ సినిమాను థియేటర్‌లో విడుదల చేయాలని భావించినా, కరోనా పరిస్థితుల కారణంగా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఓటీటీ వేదికగా తీసుకొస్తున్నారు. తాజాగా ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ రెండు సినిమాల ఓటీటీ బిజినెస్‌ ద్వారా మంచి ప్రాఫిట్‌ లభించిందని టాలీవుడ్‌ టాక్‌. ‘నారప్ప’ కోసం అమెజాన్‌తో రూ.40కోట్లకు డీల్‌ చేసుకున్నారట. దీనికి శాటిలైట్‌ రైట్స్‌ అదనం.

ఇక ‘దృశ్యం2’ విడుదలపై స్పష్టత లేనప్పటికీ భారీ మొత్తానికే డీల్‌ కుదిరినట్లు తెలుస్తోంది. సుమారు 35కోట్లకు ‘దృశ్యం2’ రీమేక్‌ను ఇచ్చినట్లు సమాచారం. అయితే ఏ ఓటీటీలో దీన్ని విడుదల చేస్తారో ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్‌లో విడుదల చేసినా ఈ స్థాయి కలెక్షన్లు ఆశించలేం. దీంతో వెంకీమామ కలెక్షన్ల పరంగా ఓటీటీలోనూ తనదైన సత్తా చాటారని ఆయన అభిమానులు అంటున్నారు. దీనిపై చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు. తమిళ సూపర్‌హిట్‌ ‘అసురన్‌’ రీమేక్‌గా ‘నారప్ప’, మలయాళ థ్రిల్లర్‌ ‘దృశ్యం2’ అదే పేరుతో రీమేక్‌ అయింది. మరికొన్ని రోజులు పరిస్థితులు ఇలాగే కొనసాగితే, పెద్ద చిత్రాలు కూడా ఓటీటీలవైపు చూసే అవకాశం ఉంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని