వెంకటేశ్‌ ‘నారప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ - venkatesh narappa release date fix
close
Published : 29/01/2021 14:55 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

వెంకటేశ్‌ ‘నారప్ప’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

హైదరాబాద్‌: వెంకటేశ్‌ కథానాయకుడిగా శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘నారప్ప’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘అసురన్‌’ రీమేక్‌గా ఈ సినిమా రూపొందిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘నారప్ప’ విడుదల తేదీని చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

ఈ ఏడాది మే14న ‘నారప్ప’ను థియేటర్‌లలో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలుపుతూ రెండు కొత్త పోస్టర్లను చిత్ర బృందం పంచుకుంది. తమిళ ‘అసురన్‌’ను మరిపించేలా తెలుగులో ‘నారప్ప’ను తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. చిత్రీకరణ విషయంలో అస్సలు వెనకడుగు వేయడం లేదు. గతంలో షూట్‌ చేసిన కొన్ని సన్నివేశాలు బలంగా లేకపోవడంతో ఇటీవల వాటిని రీషూట్‌ చేసినట్లు సమాచారం. ప్రియమణి, కార్తీక్‌ రత్నం, ప్రకాశ్‌ రాజ్‌, మురళీశర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను సురేశ్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సురేశ్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మిస్తున్నారు.

ఇవీ చదవండి...

సమయం లేదు మిత్రమా..! RRR: తారక్‌ ప్రేయసి జెన్నీఫర్‌ ఆగయా

 



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని