#F3Movie: నవ్వులు మళ్లీ మొదలు - venkatesh varuntej sunil new film f3 shoot resumes
close
Published : 02/07/2021 18:37 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#F3Movie: నవ్వులు మళ్లీ మొదలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేక్షకులకి వినోదం పంచేందుకు ‘ఎఫ్‌ 3’ చిత్ర బృందం మళ్లీ సన్నద్ధమవుతోంది. వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రమిది. లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా చిత్రీకరణ శుక్రవారం పునఃప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సెట్లోని దృశ్యాల్ని అభిమానులతో పంచుకుంది చిత్ర బృందం. ఇందులో దర్శకుడు అనిల్‌, నటులు వెంకటేశ్‌, వరుణ్‌, సునీల్‌ నవ్వుతూ కనిపించారు. దిల్‌ రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. వెంకటేశ్‌ సరసన తమన్నా, వరుణ్‌ సరసన మెహరీన్‌ సందడి చేయనున్నారు. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన ‘ఎఫ్‌ 2’ ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వింది. దానికి కొనసాగింపుగా వస్తోంది ‘ఎఫ్‌ 3’. ఈ సారి సునీల్‌ తోడవ్వటంతో అంతకు మించిన కామెడీ ఖాయమనిపిస్తోంది.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని