దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు - venky mama wraps his portion of the shoot for drishyam2
close
Updated : 15/04/2021 15:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దృశ్యం-2: వెంకీమామ పూర్తి చేశాడు

హైదరాబాద్‌: వెంకటేశ్‌, మీనా కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘దృశ్యం2’. గత కొన్నిరోజులుగా ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా గురువారంతో వెంకటేశ్‌ షూటింగ్‌ పార్ట్‌ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ దర్శకుడు, ఇతర నటీనటులతో కలిసి వెంకటేశ్‌ దిగిన ఓ ఫొటోని తాజాగా చిత్ర నిర్మాణ సంస్థ సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేసింది.

2014లో విడుదలైన ‘దృశ్యం’కు సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అలాగే మలయాళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘దృశ్యం-2’కి రీమేక్‌ ఇది. మాతృకను తెరకెక్కించిన దర్శకుడు జితు జోసఫ్‌ రీమేక్‌ను కూడా తీర్చిదిద్దుతున్నారు. సస్పెన్స్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో వెంకటేశ్‌ సతీమణిగా మీనా కనిపించనున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని