‘సడక్‌ 2’కు దారుణమైన రేటింగ్‌ - very pathetic Rating for sadak 2 Movie
close
Updated : 31/08/2020 12:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘సడక్‌ 2’కు దారుణమైన రేటింగ్‌

ముంబయి: ఆలియాభట్‌ ప్రధాన పాత్రలో ఆమె తండ్రి మహేష్‌భట్‌ తెరకెక్కించిన చిత్రం ‘సడక్‌ 2’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్‌ కోటికి పైగానే డిస్‌లైకులతో అత్యధికమంది ఇష్టపడని యూట్యూబ్‌ వీడియోగా రికార్డు సృష్టించింది. ఇప్పుడు ఈ సినిమా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఆగస్టు 28న ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం పరమ చెత్తగా ఉందంటూ సుమారు పదివేల మంది ప్రేక్షకులు ఐఎండీబీలో 10కి 1.1 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు. దీంతో ఐఎండీబీలో అత్యంత దారుణమైన రేటింగ్‌ దక్కించుకున్న చిత్రంగా ఇది నిలిచింది.

1.3 స్టార్‌ రేటింగ్‌తో టర్కీ సినిమా రెండో స్థానంలో ఉంది. బాలీవుడ్‌ చిత్రాలు హిమ్మత్‌వాలా 1.7, రామ్‌గోపాల్‌ వర్మ ‘ఫైర్‌’ 1.7, అభిషేక్‌ బచ్చన్‌ ‘ద్రోణ’, హిమేష్‌ రేష్మియా ‘కర్జ్‌’ చిత్రాలు 2 రేటింగ్‌ తెచ్చుకున్నాయి. ఆ ఫ్లాప్‌ చిత్రాల కంటే ‘సడక్‌ 2’ దారుణంగా ఉందంటూ నెటిజన్లు స్పందించడం చర్చనీయాంశంగా మారింది.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ఆత్మహత్మ చేసుకున్న నాటి నుంచి బాలీవుడ్‌ సెలబ్రిటీలపై నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఆలియాను ఓ రేంజ్‌లో ఆడిపోసుకుంటున్నారు. ఆ క్రమంలోనే ‘సడక్‌ 2’ ట్రైలర్‌ విడుదల కాగానే డిస్‌లైక్‌లు కొడుతూ ఆగ్రహావేశాలను ప్రదర్శించారు. ఇప్పుడు సినిమా విడుదలయ్యాకా రేటింగ్స్‌పై తమ ప్రతాపం చూపెడుతున్నారు. ‘సినిమా చెత్తగా ఉంది’, ‘ఒక్క స్టార్‌ ఇవ్వడమే ఎక్కువ’ ఇలా కామెంట్లు పెడుతున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని