గాయకుడు జి.ఆనంద్‌ కన్నుమూత: చిరు సంతాపం - veteran telugu playback singer g anand passed away
close
Published : 07/05/2021 20:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

గాయకుడు జి.ఆనంద్‌ కన్నుమూత: చిరు సంతాపం

హైదరాబాద్‌: ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు జి.ఆనంద్‌ ఇకలేరు. కరోనాతో బాధపడుతూ ఆయన కన్నుమూశారు. కొన్ని రోజుల కిందట కరోనా బారిన పడిన ఆనంద్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అమెరికా అమ్మాయి(1976) చిత్రంతో నేపథ్య గాయకుడిగా మొదలైన ఆయన ప్రస్థానంలో ఎన్నో అద్భుత గీతాలను ఆలపించారు. వాటిలో ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘విఠలా.. విఠలా’ వంటి పాటలు విశేష జనాదరణ పొందాయి. 67ఏళ్ల జి.ఆనంద్‌ శ్రీకాకుళం జిల్లాలో జన్మించారు. గాయకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేశారు.

ఆనంద్‌ మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు విచారం వ్యక్తం చేశాయి. అగ్ర కథానాయకుడు చిరంజీవి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘‘ఎన్నియల్లో.. ఎన్నియల్లో.. ఎందాక’ అంటూ నా సినీ జీవితంలో తొలి పాటకి గాత్ర దానం చేయడం ద్వారా నాలో ఒక భాగమైన మృదు స్వభావి, చిరుదరహాసి జి.ఆనంద్‌గారు కర్కశమైన కరోనా బారిన పడి ఇకలేరని నమ్మలేకపోతున్నా. మొదటిసారి వెండితెరపై ఆయన గొంతు పాడిన పాటకే నేను నర్తించాననే విషయం, ఆయనతో నాకు ఒక అనిర్వచనీయమైన అవినాభావ బంధం ఏర్పరిచింది. ఆయన కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం’’ అని చిరు ట్విట్‌ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని