‘శ్రీకారం’ చిత్రానికి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి - vice president congratulates to sreekaram movie
close
Published : 23/03/2021 13:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

 ‘శ్రీకారం’ చిత్రానికి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

ఇంటర్నెట్‌ డెస్క్: శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్రీకారం’. కిశోర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రియాంక్ అరుళ్‌ మోహన్‌ కథానాయిక. వ్యవసాయం ఇతివృత్తంగా తెరకెక్కిన ‘శ్రీకారం’ చిత్రబృందానికి ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. ‘‘వ్యవసాయ పునర్వైభవం కోసం గ్రామాలకు మరలండి అనే స్ఫూర్తిని యువతలో రేకెత్తించే విధంగా తెరకెక్కించిన ‘శ్రీకారం’ చక్కని చిత్రం. కుటుంబం, ఊరు అందరూ కలిసి ఉంటే సాధించలేనిది ఏదీ లేదనే చక్కని సందేశాన్ని అందించిన చిత్ర దర్శక నిర్మాతలు, నటీనటులకు శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. 14రీల్స్‌ పతాకంపై రూపొందిన ఈ చిత్రానికి రామ్‌ అచంట, గోపీ అచంట నిర్మాతలు. మిక్కీ జె.మేయర్‌ సంగీతం అందించారు.


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని