ఎన్టీఆర్‌ లెజెండ్‌గా జీవించారు: వెంకయ్య - vice president venkaiah relesed book on ntr life
close
Published : 18/02/2021 19:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ లెజెండ్‌గా జీవించారు: వెంకయ్య

‘మేవరిక్‌ మెస్సయ్య’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి

హైదరాబాద్‌: రాజకీయ జీవితంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ లెజెండ్‌గా జీవించారని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఆయన రాజకీయ జీవితం శోభాయమానంగా ఉండేదని చెప్పారు. హైదరాబాద్‌ దసపల్లా హోటల్‌లో ‘మేవరిక్‌ మెస్సయ్య’ పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. ఎన్టీఆర్‌ రాజకీయ జీవిత విశేషాలపై కందుల రమేశ్‌ ఈ పుస్తకాన్ని రచించారు. జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకుని ప్రతిపక్షాలను బలోపేతం చేసిన ఘనత ఎన్టీఆర్‌ది అని.. నేషనల్ ఫ్రంట్‌ ఛైర్మన్‌గానూ ఆయన పనిచేశారని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు.

‘‘ఎన్టీఆర్ రాజకీయ చరిత్రపై రమేశ్‌ పుస్తకం రచించినందుకు అభినందనలు. భవిష్యత్ తరానికి ఎన్టీఆర్ చరిత్ర తెలియాలి. ఆయనపై మరిన్ని పుస్తకాలు తీసుకురావాల్సిన అవసరముంది. ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చేందుకు అనేక సవాళ్లు ఎదుర్కొన్నారు. ప్రాంతీయ, జాతీయ రాజకీయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు.  పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి వచ్చారు. ప్రజలు ఎన్టీఆర్ను నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆరాధించారు. తెలుగు భాషకు గుర్తింపు తీసుకువచ్చిన నేత ఆయన. 

ఎన్టీఆర్ రంగప్రవేశంతో రాజకీయాలు మారిపోయాయి. ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఆయన అనేక పథకాలు ప్రవేశ పెట్టారు. ఎన్టీఆర్ ది కమాండింగ్ పర్సనాలిటీ. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. ఎన్టీఆర్ నటుడు కాదు నిజమైన లెజెండ్. పార్టీ ప్రచారంలో చైతన్య రథం వెంట వేలాది మంది ఉండేవారు. అనేక సంక్షేమ పథకాలను ఎన్టీఆర్ ప్రవేశపెట్టారు. వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు కల్పించారు. ఆయన జీవితచరిత్రపై మరిన్ని పుస్తకాలు వస్తాయన్న విశ్వాసం ఉంది’’ అని వెంకయ్యనాయుడు అన్నారు.

కులమతాలకు అతీతంగా ఎన్టీఆర్‌ను ఆరాధిస్తారు: సంజయ్‌బారు

తెలుగువారిని ఎన్టీఆర్‌ ఏకతాటిపైకి తీసుకొచ్చారని ప్రధానమంత్రి మాజీ సలహాదారు, రచయిత సంజయ్‌బారు అన్నారు. ఎన్టీఆర్‌ జీవితంపై పుస్తకాన్ని రాసిన కందుల రమేశ్‌ను అభినందిస్తున్నట్లు చెప్పారు. ‘‘కుల, మత, ప్రాంతాలకు అతీతంగా ఎన్టీఆర్ను ప్రజలు ఆరాధిస్తారు. విద్య, వైద్య, వ్యవసాయ రంగాలకు ఆయన పెద్ద పీట వేశారు. ఈ పుస్తకంలో ఎన్టీఆర్ రాజకీయ జీవిత చరిత్ర ఉంది. ప్రతి ఒక్కరూ చదవాలి’’ అని ఆయన సూచించారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని