‘అశ్వథ్థామ’గా రాబోతున్న విక్కీ కౌశల్‌ - vicky kaushal new movie ashwathama
close
Published : 12/01/2021 09:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘అశ్వథ్థామ’గా రాబోతున్న విక్కీ కౌశల్‌

ముంబయి: మహాభారతంలోని అశ్వథ్థామ పాత్రని ఆధారంగా చేసుకోని బాలీవుడ్‌లో ‘అశ్వథ్థామ’ పేరుతో ఓ భారీ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం రూపొందుతోంది. విక్కీ కౌశల్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆదిత్య ధర్‌ దర్శకుడు. రోన్నీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు. ‘ఉరీ: ది సర్జికల్‌ స్ట్రైక్‌’ లాంటి హిట్‌ తర్వాత ఈ ముగ్గురి కలయికలో వస్తున్న కొత్త చిత్రమిది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో విక్కీ ఓ రోబో చేతిలో సూపర్‌ హీరోలా నుంచోని ఆకట్టుకునేలా కనిపించారు. ‘‘మహాభారతం నుంచి వచ్చిన పాత్ర ఆధారంగా ఫ్యూచరిస్టిక్‌ సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంగా దీన్ని రూపొందిస్తున్నాం. విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎంతో ప్రాధాన్యముంది. మూడు భాగాలుగా ఈ చిత్రాన్ని     తెరకెక్కించాలని ప్రణాళిక రచిస్తున్నాం. ఏప్రిల్‌ నుంచి  చిత్రీకరణ ప్రారంభమవుతుంది. ’’ అని నిర్మాత తెలిపారు.  


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని