కత్రినా-విక్కీ కౌశల్‌.. మధ్యలో సల్మాన్‌ - vicky kaushal proposes to katrina kaif in front of salman khan
close
Published : 09/07/2021 01:30 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కత్రినా-విక్కీ కౌశల్‌.. మధ్యలో సల్మాన్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమా వేడుకల సందర్భంగా తారలు చేసే సందడి అంతా ఇంతా కాదు. జోకులు వేసుకుంటూ, ఒకరినొకరు ఆట పట్టించుకుంటూ ఆ కార్యక్రమానికి వచ్చిన వారికి నవ్వులు పంచుతారు. అలా 2019లో జరిగిన ఓ కార్యక్రమానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే..

2019లో జరిగిన ఓ అవార్డుల వేడుకలో బాలీవుడ్‌ బ్యూటీ కత్రినాకైఫ్‌కు ‘ఉరి’ యాక్టర్‌ విక్కీ కౌశల్‌ వేదికపైనే మ్యారేజ్‌ ప్రపోజల్‌ చేశాడు. ‘మంచి వాడైన విక్కీ కౌశల్‌ లాంటి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా?ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్‌ నడుస్తోంది. నువ్వు కూడా అలా చేయొచ్చు. అందుకే నేను అడుగుతున్నా’ అని అనే సరికి కత్రినా ఒక్క నిమిషం ఆశ్చర్యానికి గురైంది. దీంతో అవార్డుల కార్యక్రమానికి వచ్చిన వారంతా ఒకటే నవ్వులు. అక్కడే ఉన్న సల్మాన్‌ మాత్రం తన సోదరి భుజంపై పడిపోయినట్లు నటించాడు. ‘నాకు అంత ధైర్యం లేదు’ అని కత్రినా సమాధానం ఇవ్వగానే తలను పైకి లేపి అటూ ఇటూ చూశాడు.

కత్రినా-విక్కీ ఎప్పటినుంచో రిలేషన్‌షిప్‌లో ఉన్నారని నటుడు హర్షవర్దన్‌ కపూర్‌ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే. ఇలా చెప్పినందుకు తాను ఇబ్బందులు ఎదుర్కొంటానని కూడా హర్షవర్దన్‌ చెప్పడం గమనార్హం.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని