Sardar Udham: విక్కీ ‘సర్దార్‌ ఉద్దమ్‌’.. ఆ ఓటీటీలో విడుదల! - vicky kaushal sardarudham is coming straight to amazon prime
close
Published : 24/09/2021 15:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Sardar Udham: విక్కీ ‘సర్దార్‌ ఉద్దమ్‌’.. ఆ ఓటీటీలో విడుదల!

ఇంటర్నెట్‌డెస్క్‌: విక్కీ కౌశల్‌ కీలక పాత్రలో సూజిత్‌ సిర్కార్‌ దర్శకత్వం వహిస్తున్న హిస్టారికల్‌ డ్రామా ‘సర్దార్ ఉద్దమ్‌’. విక్కీ ఇందులో టైటిల్‌ రోల్‌ పోషిస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకులను అలరించబోతోంది. అయితే, థియేటర్‌లో కాదు. ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా అక్టోబరులో ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందంతో పాటు, అమెజాన్‌ ప్రైమ్‌ కూడా ప్రకటించింది.

1919 జలియన్‌ వాలాబాగ్‌ ఉదంతం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జలియన్‌ వాలాబాగ్‌లో సమావేశమైన స్వాతంత్ర్య సమరయోధులపై బ్రిటిష్ అధికారి, జనరల్ డయ్యర్‌ తన సైన్యంతో వచ్చి, తుపాకీ గుళ్ల వర్షం కురిపించాడు. ఈ ఘటనలో మొత్తం వెయ్యికు పైగా భారతీయులు మృత్యువాతపడ్డారు. భారతదేశ చరిత్రలో అదొకర చీకటిదినంగా చరిత్రకారులు అభివర్ణిస్తారు. వందల మంది మృతికి కారణమైన జనరల్‌ డయ్యర్‌ను గదర్‌ పార్టీకి చెందిన విప్లవకారుడు ఉద్దమ్‌ సింగ్‌ కాల్చి చంపాడు. అనంతరం ఉరిశిక్ష అనుభవించాడు. ఇప్పుడు ఈ కథతోనే విక్కీ-సూజిత్‌ సిర్కార్‌లు ‘సర్దార్‌ ఉద్దమ్‌’ తెరకెక్కించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని