‘క్రాక్‌’కి నారప్ప వాయిస్‌ ఓవర్‌ - victory venkatesh voice over
close
Published : 31/12/2020 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘క్రాక్‌’కి నారప్ప వాయిస్‌ ఓవర్‌

హైదరాబాద్‌: ఎనర్జిటిక్‌ నటనకు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన రవితేజ నటించిన చిత్రం ‘క్రాక్‌’. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి మాస్‌ మహారాజ్‌ ఎనర్జీకి తగ్గట్టు, పవర్‌ఫుల్‌ వాయిస్‌ ఓవర్‌ ఉంటే.. సినిమా ఒక రేంజ్‌లో ఉంటుంది కదా! తాజాగా అందుకు సంబంధించి ఒక వార్త అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది.  విక్టరీ వెంకటేష్‌  ‘క్రాక్‌’ చిత్రానికి తన గళాన్ని అందించబోతున్నట్టు చిత్ర బృందం తెలియజేసింది. క్రాకింగ్‌ న్యూస్‌ అంటూ ట్వీట్‌ చేసిన ఆయన..‘వెంకీ మామ ఫర్‌ క్రాక్‌’ అంటూ హ్యాష్‌ట్యాగ్‌ ఉంచారు. మరి మన నారప్ప చేసే ‘క్రాక్‌’ కథా పరిచయం చూడాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే. గతంలో నితిన్‌ ‘శ్రీనివాస కల్యాణం’ చిత్రానికి వెంకీమామ వాయిస్‌ఓవర్‌ అందించారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని