నా భర్తే నా షారుఖ్‌ఖాన్‌! - vidya balans reply to fan who asked her to choose between shah rukh and salman is epic
close
Published : 08/06/2021 23:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నా భర్తే నా షారుఖ్‌ఖాన్‌!

*అభిమానికి ఫన్నీగా సమాధానమిచ్చిన విద్యాబాలన్‌ 

తనదైన శైలిలో నటించి అభిమానులను అలరించే బాలీవుడ్‌ నటి విద్యాబాలన్‌.. ఫ్యాన్స్‌ అడిగే ప్రశ్నలకు అదే రీతిలో సమాధానమిచ్చి ఆకట్టుకుంటారు.  తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఓ అభిమాని.. సల్మాన్‌, షారుఖ్‌లో ఒకరిని ఎంపిక చేసుకోవాలంటే ఎవరిని ఎంచుకుంటారు అని ప్రశ్నించగా..  తన భర్త సిదార్థ రాయ్‌తో కలిసి దిగిన ఫొటోను జతచేసి ఇతడే నా ఎస్‌ఆర్‌కే (షారుఖ్‌ఖాన్‌) అని ఫన్నీగా బదులిచ్చారు. కాగా విద్యాబాలన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘షేర్నీ’ చిత్ర ట్రైలర్‌ ఇటీవలే విడుదలై మంచి స్పందన అందుకోగా, జూన్ 18 నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అడ‌వి నేప‌థ్యంలో సాగే ఈ చిత్రాన్ని అమిత్‌ మసుర్కర్‌ దర్శకత్వం వహించారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని