తెలుగు కథానాయకుడిగా విజయ్‌ సేతుపతి? - vijay sethupathi as the protagonist in telugu movie
close
Published : 28/05/2021 14:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

తెలుగు కథానాయకుడిగా విజయ్‌ సేతుపతి?

ఇంటర్నెట్‌ డెస్క్: వివైధ్య, విలక్షణ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఆయన తమిళ, తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారక్టర్‌ ఆర్టిస్టుగాను నటిస్తూ మెప్పిస్తున్నాడు. తాజాగా ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. మైత్రీ మూవీస్‌ నిర్మాణ సంస్థ సేతుపతికి ఓ కథను కూడా వినిపించారట. అయితే దీనిపై అధికారికంగా వార్త  బయటకు రాలేదు. త్వరలోనే సినిమాకి సంబంధించి వివరాలు తెలియనున్నాయని వినికిడి. విజయ్‌ ఇప్పటికే తెలుగు భాషను నేర్చుకుంటున్నాడని సమాచారం. విజయ్‌ నటించిన ‘పిజ్జా’, ‘అంజలి సీబీఐ’, ‘పేట’ వంటి అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక చిరంజీవి హీరోగా నటించిన ‘సైరా నరసింహా రెడ్డి’లో రాజా పాండి పాత్రలో కనిపించాడు. వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటించిన ‘ఉప్పెన’లో ప్రతినాయకుడిగా శేష రాయనం పాత్రలో చాలా బాగా నటించాడనే ప్రసంశలు కూడా వచ్చాయి. ప్రస్తుతం హిందీలో ‘ముంబయికర్‌’, ‘గాంధీటాక్స్’ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. తమిళంలో నయనతార, సమంతతో కలిసి ‘కాతు వాకుల రెండు కాదల్’, ‘లాబం’ సినిమాలు చేస్తున్నారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని