విజయ్‌ సేతుపతి ఎంట్రీ చూశారా..! - vijay sethupathi badass entry from uppena
close
Published : 15/04/2021 19:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

విజయ్‌ సేతుపతి ఎంట్రీ చూశారా..!

హైదరాబాద్‌: ‘రాయణం’గా విజయ్‌ సేతుపతి ఓ కీలకపాత్ర పోషించి, మెప్పించిన చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయిక తండ్రి పాత్రలో, ఓ ప్రతినాయకుడిగా ఆయన నటన తెలుగువారిని ఎంతగానో ఆకర్షించింది. బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఇటీవల నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తాజాగా ‘ఉప్పెన’ నుంచి విజయ్‌సేతుపతి ఎంట్రీ సీన్‌ను నెట్‌ఫ్లిక్స్‌ సినీ ప్రియులతో పంచుకుంది. ఇందులో రాజీవ్‌ కనకాలపై అతడు దాడి చేస్తూ కనిపిస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుంటోంది.

లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో వైష్ణవ్‌ తేజ్‌, కృతిశెట్టి వెండితెరకు పరిచయమయ్యారు. ఆసి, బేబమ్మలుగా వాళ్లిద్దరి నటన మెప్పించింది. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకాదరణ మెండుగా పొందింది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని