ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్‌ సెల్వన్‌..! - vijay sethupathi to play villian role in ntr and trivikram movie
close
Published : 23/02/2021 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ను ఢీకొట్టనున్న మక్కళ్‌ సెల్వన్‌..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ కలయికలో ఓ సినిమా రాబోతున్న విషయం అందిరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రీకరణలో నిమగ్నమైన తారక్‌.. తర్వాత సినిమా చేయబోయేది త్రివిక్రమ్‌తోనే. అయితే.. ఆ సినిమా ప్రారంభానికి ముందే దాని గురించి ఆసక్తికరమైన వార్తలు వినిపిస్తున్నాయి.  తారాగణం గురించి ఎలాంటి వివరాలు ప్రకటించకుండానే ఆ చిత్రంలో ప్రతినాయకుడి పాత్రపై రకరకాల ఊహాగానాలు సాగుతున్నాయి. కొంతకాలం క్రితం ఈ సినిమాలో ప్రతినాయకుడిగా బాలీవుడ్‌ నటుడు సునిల్‌ శెట్టి నటిస్తున్నారన్న వార్తలు వినిపించాయి. తాజాగా మరో వార్త ఆసక్తిరేపుతోంది. ఈమధ్యకాలంలో విలన్‌పాత్రలకు కేరాఫ్‌గా నిలుస్తూ అలరిస్తున్న మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌సేతుపతి.. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ను ఢీకొట్టబోతున్నాడనేది వార్త సారాంశం.

ఇటీవల విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించిన ‘మాస్టర్‌’, ‘ఉప్పెన’ బ్లాక్‌బస్టర్‌ హిట్లు కొట్టాయి. దీంతో విజయ్‌ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. దీనికి తోడు ఇటీవల త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం భారీ విజయం సాధించింది. అందులోనూ ప్రతినాయకుడిగా తమిళ నటుడు సముద్రకని నటించాడు. దీంతో త్రివిక్రమ్‌ మరోసారి తమిళనటుడిపై ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. తన కథలో తారక్‌ను ఎదుర్కొనే విలన్‌గా ఇప్పుడున్న నటుల్లో విజయ్‌ సేతుపతి సరిగ్గా సరిపోతారనేది మరో వార్త. అయితే.. ఈ విషయంపై చిత్రబృందం నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఏదేమైనా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం దొరకడం మాత్రం పక్కా అని అభిమానులు భావిస్తున్నారు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని