జేపీ నడ్డాను కలిసిన విజయశాంతి - vijayashanti met bjp national president jp nadda
close
Updated : 08/12/2020 01:23 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

జేపీ నడ్డాను కలిసిన విజయశాంతి

దిల్లీ: భాజపాలో చేరిన మాజీ ఎంపీ విజయశాంతి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, మాజీ ఎంపీ వివేక్‌ ఇతర నేతలు పాల్గొన్నారు. భాజపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ విజయశాంతికి సోమవారం కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన విషయం తెలిసిందే. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో విజయశాంతి మాట్లాడారు. తాను భాజపాతోనే రాజకీయ జీవితాన్ని ఆరంభించానని, తెరాస అవినీతిని బయటపెట్టడమే తన లక్ష్యమని చెప్పుకొచ్చారు. తన పాత్ర ఏంటన్నది పార్టీయే నిర్ణయిస్తుందని.. పార్టీ ఆదేశిస్తే ఎక్కడైనా ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆమె తెలిపారు. మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని