పుష్పరాజ్ పోరాటం ఇతడితోనే - villain of pushpa arrived
close
Updated : 21/03/2021 15:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పుష్పరాజ్ పోరాటం ఇతడితోనే

విలన్‌ని పరిచయం చేసిన టీమ్‌

హైదరాబాద్‌: అల్లుఅర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ టీమ్‌ నుంచి వీకెండ్‌ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బన్నీ ‘పుష్పరాజ్‌’గా కనిపించనున్న విషయం తెలిసిందే. కాగా, ఎంతో భయంకరమైన ‘పుష్పరాజ్‌’తో పోటీ పడనున్న ప్రతినాయకుడ్ని తాజాగా చిత్రబృందం ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఈ మేరకు మలయాళీ నటుడు ఫహద్‌ ఫాజిల్‌ ఇందులో ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ‘పుష్ప’ విలన్‌ వీడియో ప్రతి ఒక్కర్నీ ఆకర్షిస్తోంది.

‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత సుకుమార్-బన్నీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్‌ చిత్రమిది. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఇందులో బన్నీ మాస్‌, రఫ్‌ లుక్‌లో విభిన్నంగా కనిపించనున్నారు. అంతేకాకుండా ‘పుష్ప’ కోసం ఆయన చిత్తూరు మాండలికాన్ని నేర్చుకున్నారు. రష్మిక కథానాయిక. మైత్రిమూవీ మేకర్స్‌ పతాకంపై ఈ చిత్రం నిర్మితమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. పాన్‌ ఇండియా మూవీగా రూపుదిద్దుకుంటోన్న ఈ సినిమా ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని