Virat Kohli: కోహ్లిలో బ్రాండ్‌ భయం? అందుకే అలా చేశాడా..? - virat fears about his endorments
close
Updated : 19/09/2021 09:27 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: కోహ్లిలో బ్రాండ్‌ భయం? అందుకే అలా చేశాడా..?

న్యూదిల్లీ: క్రికెట్‌ మైదానంలో దిగితే కోహ్లి ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలిసిందే. ఆటగాళ్లలో ఉత్సాహం నింపుతాడు. ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అంటాడు. బ్యాటుతోనే కాదు.. మాటతోనూ సమాధానం ఇవ్వగల దిట్ట. అలాంటి కోహ్లిలో తన బ్రాండ్‌ విలువ పడిపోతుందేమోననే భయం పట్టుకుందట! ఇది ఒక ఆంగ్ల పత్రిక కథనం సారాంశం. టీ20 ప్రపంచకప్‌ ముగిసిన తర్వాత కెప్టెన్సీ నుంచి దిగిపోతానని విరాట్‌ రెండు రోజుల కిందట ప్రకటించాడు. ఒకవేళ తను పొట్టి ఫార్మాట్‌ వరల్డ్‌కప్‌లో జట్టును ముందుండి నడిపించకపోతే వన్డే కెప్టెన్సీ కూడా తొలగించే యోచనలో బీసీసీఐ పెద్దలు ఉన్నారట. దీంతో తన బ్రాండ్‌ విలువ ఎక్కడ పడిపోతుందో అని విరాట్‌ సన్నిహితుల దగ్గర వాపోయినట్టు సమాచారం.

నిజానికి చాలామంది సీనియర్లు ఊహించినట్టు తనంత తానుగానే వన్డే కెప్టెన్‌గా పగ్గాలు వదిలేయాలనుకునే ఆలోచనలో ఉన్నా.. ఇదే కారణంతో నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నాడట. ఈ కథనంపై మార్కెట్‌ నిపుణులు స్పందించారు. దీన్నో చిన్న విషయంగా కొట్టిపారేశారు. ‘గతంలో సచిన్‌ తెందుల్కర్‌ కెప్టెన్సీకి రాజీనామా చేసిన తర్వాత కూడా తన ఎండార్స్‌మెంట్‌లు ఏమీ తగ్గిపోలేదు. వన్డే జట్టు నాయకుడిగా తప్పుకున్నా, ఆటలో అత్యంత ప్రతిభావంతుడైన విరాట్‌ కోహ్లికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ఇది చిన్న మార్పే తప్ప అతడి బ్రాండ్‌పై ఎలాంటి ప్రభావం పడదు’ అని పేర్కొన్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని