Virat Kohli: వామిక.. దేవత అంటున్న మేనత్త! - virat kohli sister statement on vamika
close
Published : 16/06/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: వామిక.. దేవత అంటున్న మేనత్త!

వారి గోప్యతకు భంగం కలిగించొద్దని విజ్ఞప్తి

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ, అనుష్క శర్మ గారాల పట్టి ‘వామిక’. ఇప్పటి వరకు ఆమె ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఆమె చిత్రాలను విరుష్క దంపతులు సోషల్‌ మీడియాలో పంచుకోవడం లేదు. కానీ అభిమానులు మాత్రం ఆమె రూపురేఖల గురించి తెలుసుకొనేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కాగా వామిక దేవతలా ఉంటుందని కోహ్లీ సోదరి భావ్నా కోహ్లీ దింఘ్రా అంటోంది.

ఈ మధ్య కాలంలో ప్రముఖులు సోషల్‌ మీడియా ద్వారా జవాబులు చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా భావ్నా సైతం ‘ఏదైనా అడగండి’ అంటూ ఓ సెషన్‌ నిర్వహించింది. అందులో కొందరు అభిమానులు ‘వామిక’ను చూశారా? అని ప్రశ్నించారు. ‘అవును, చూశాం. ఆమె దేవతలా ఉంటుంది’ అని బదులిచ్చింది. ఈ విషయం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవ్వడంతో వెంటనే ఆమె స్పందించింది. ‘దయచేసి ఈ విషయం గురించి మాట్లాడొద్దు. కోహ్లీ, అనుష్క కోరుకున్నట్టుగా వారి గోప్యతకు భంగం కలిగించొద్దు’ అని విజ్ఞప్తి చేసింది.

వామిక చిత్రాలను సోషల్‌ మీడియాలో పంచుకోవద్దని, మీడియాకు ఎక్కువగా చెప్పకూడదని విరుష్క జంట నిర్ణయించుకుంది. ఆమె పెరిగి పెద్దదై సోషల్‌ మీడియా గురించి తెలుసుకొనేంత వరకు గోప్యత పాటించాలన్నది వారి ఉద్దేశం. అందుకే ఎవరడిగినా ఆమె వివరాలు పంచుకోవడం లేదు. ఇంగ్లాండ్‌ పర్యటనకు బయల్దేరే ముందు వామిక చిత్రాలను తీసేందుకు ప్రయత్నించగా.. కోహ్లీ, అనుష్క అడ్డుకున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని