Virat Kohli: నాదీ, కోహ్లీది వేర్వేరు శైలి - virat kohli and my playing style is different
close
Updated : 03/06/2021 15:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: నాదీ, కోహ్లీది వేర్వేరు శైలి

పోలికలపై బాబర్‌ ఆజామ్‌ అభిప్రాయం

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ అని పాక్‌ సారథి బాబర్‌ ఆజామ్‌ అన్నాడు. అతడితో తనను పోల్చినప్పుడు గర్వంగా అనిపిస్తుందని పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా తను పోలికలను ఇష్టపడనని తెలిపాడు. వాటివల్ల ఒత్తిడికి మాత్రం గురవ్వనని వెల్లడించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ జాబితాలో అతడు విరాట్‌ను దాటేసి అగ్రస్థానం చేరుకున్న సంగతి తెలిసిందే.

‘విరాట్‌ ప్రపంచంలోని గొప్ప ఆటగాళ్లలో ఒకడు. ప్రతి మైదానంలో, పెద్ద మ్యాచుల్లో అతడు నిరూపించుకున్నాడు. ఎవరైనా మమ్మల్ని పోలిస్తే నేను ఒత్తిడికి గురవ్వను. అలాంటి పెద్ద ఆటగాడితో నన్ను పోలుస్తున్నందుకు గర్వంగా ఉంటుంది. వ్యక్తిగతంగా పోలికలు వద్దనే అనుకుంటాను. కానీ ప్రజలు కొన్నిసార్లు పోలుస్తూనే ఉంటారు. నాకైతే సంతోషంగానే ఉంటుంది. నా లక్ష్యం ఒక్కటే. కోహ్లీలా నేనూ ఆడాలి. నా జట్టు విజయాలకు సాయపడాలి. నా దేశాన్ని గర్వించేలా చేయాలి’ అని బాబర్‌ అన్నాడు.

‘ఏదేమైనా నేను, కోహ్లీ భిన్నమైన ఆటగాళ్లం. ఎవరి ఆటతీరు వారిది. అందుకే నా శక్తిమేర ఆడేందుకు ప్రయత్నిస్తాను. క్రికెట్‌లో నాకీ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉంది. పెద్ద ఆటగాళ్ల సరసన నా పేరు చేరడం గర్వంగా అనిపిస్తోంది. వెస్టిండీస్‌పై మూడు శతకాలు చేయడం నా కెరీర్‌లో కీలక మలుపు. అప్పుడే నా ఆత్మవిశ్వాసం పెరిగింది. అయితే ప్రతి మ్యాచ్‌ను నేను ఆఖరి మ్యాచ్‌గా భావించి ఆడతాను’ అని ఆజామ్‌ తెలిపాడు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని