Rashmika: నా అభిమాన క్రికెటర్‌ విరాట్‌ కాదు! - virat kohli is not my favorite cricketer says rashmika
close
Published : 17/05/2021 16:50 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Rashmika: నా అభిమాన క్రికెటర్‌ విరాట్‌ కాదు!

‘నీకు అర్థం అవుతుందా..?’ అంటూ అభిమానుల హృదయాలను కొల్లగొట్టిన ముద్దుగుమ్మ రష్మిక మందన. తన అందచందాలతో దక్షిణ భారత చిత్ర సీమను ఓ ఊపు ఊపేస్తోంది. సినిమాలే కాకుండా క్రికెట్‌నూ ఆమె బాగా ఫాలో అవుతుందట. రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తన అభిమాన జట్టని  సోషల్‌ మీడియాలో చెప్పింది. ఆర్‌సీబీ ఈ ఏడాది కప్‌ కొట్టాలంది. అయితే తనకిష్టమైన క్రికెటర్‌ మాత్రం విరాట్‌ కోహ్లీ కాదని బాంబు పేల్చింది!

టీమ్‌ఇండియా మాజీ సారథి, చెన్నై సూపర్‌కింగ్స్‌ నాయకుడు ఎంఎస్ ధోనీ అంటే తనకెంతో ఇష్టమని రష్మిక చెబుతోంది. అతడిని ‘మాస్టర్‌ క్లాస్‌ ప్లేయర్‌’గా వర్ణించింది. ‘ధోనీ బ్యాటింగ్‌, నాయకత్వం, వికెట్‌ కీపింగ్‌ అద్భుతం. వీటిలో అతడికి తిరుగులేదు. అతడో మాస్టర్‌ క్లాస్‌ ప్లేయర్‌. ధోనీ నా హీరో’ అని రష్మిక్‌ సోషల్‌ మీడియాలో వివరించింది.

ప్రస్తుతం రష్మిక తెలుగులో ‘పుష్ఫ’ చిత్రంలో నటిస్తోంది. అమితాబ్‌ నటించే బాలీవుడ్‌ చిత్రానికీ సంతకం పెట్టింది. ‘మిషన్‌ మంజు’ చిత్రం ద్వారా ఆమె హిందీ పరిశ్రమకు పరిచయమైంది. కాగా కరోనా వైరస్‌ వల్ల ఐపీఎల్‌ నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.

-ఇంటర్నెట్‌ డెస్క్‌



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని