Cricket News: ఇంగ్లాండ్‌ బయల్దేరిన కోహ్లీ, మిథాలీ జట్లు - virat kohli mithali raj and teams leave for england
close
Published : 03/06/2021 10:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cricket News: ఇంగ్లాండ్‌ బయల్దేరిన కోహ్లీ, మిథాలీ జట్లు

ముంబయి: సుదీర్ఘ పర్యటన కోసం భారత మహిళల, పురుషుల క్రికెట్‌ జట్లు ఇంగ్లాండ్‌ బయల్దేరాయి. గురువారం ఉదయం విరాట్‌ కోహ్లీ, మిథాలీ సేనలు ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో కలిసే ప్రయాణం చేస్తుండటం గమనార్హం. భారత క్రికెట్‌ చరిత్రలో ఈ రెండు జట్లు కలిసి ప్రయాణించడం ఇదే తొలిసారి కావడం ప్రత్యేకం. ఇంగ్లాండ్‌ వెళ్లాక క్రికెటర్లంతా పది రోజులు క్వారంటైన్‌లో ఉంటారు.

కోహ్లీసేన న్యూజిలాండ్‌తో జూన్‌ 18న ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడనుంది. వేదిక సౌథాంప్టన్‌. నెల రోజుల విరామం తర్వాత ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసులో తలపడనుంది. ఇక మహిళల జట్టు చాన్నాళ్ల తర్వాత టెస్టు క్రికెట్‌ ఆడనుంది. ఏకైక టెస్టు ముగిశాక మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఇంగ్లాండ్‌ వెళ్లిన వెంటనే క్రికెటర్లంతా సౌథాంప్టన్‌లో పది రోజులు క్వారంటైన్లో ఉంటారు. మూడు రోజుల కఠిన క్వారంటైన్‌ తర్వాత జట్టు సభ్యులంతా కలిసి కసర్తతులు, సాధన చేస్తారు.





మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని