హార్దిక్‌కు బంతి ఎందుకివ్వలేదంటే? - virat kohli reveals why hardik pandya didnt bowl in 2nd odi against england
close
Updated : 28/03/2021 04:56 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

హార్దిక్‌కు బంతి ఎందుకివ్వలేదంటే?

పుణె: పనిభారం పర్యవేక్షణలో భాగంగానే హార్దిక్‌పాండ్యకు బౌలింగ్‌ ఇవ్వలేదని టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ వెల్లడించాడు. భవిష్యత్తు టోర్నీలను దృష్టిలో పెట్టుకొని ఇలా చేస్తున్నామని పేర్కొన్నాడు. నైపుణ్యాలను బట్టి చూస్తే అతడు ఫిట్‌గా ఉండటం తమకు అవసరమని తెలిపాడు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో ఓటమి తర్వాత విరాట్‌ మాట్లాడాడు.

రెండో వన్డేలో తొలుత బ్యాటింగ్‌ చేసిన కోహ్లీసేన 336 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌ సునాయాసంగా ఛేదించింది. ఆ జట్టు ఆటగాళ్లు ఆరంభం నుంచే చక్కని షాట్లు ఆడారు. విధ్వంసకరంగా చెలరేగారు. బెయిర్‌స్టో శతకం బాదగా స్టోక్స్‌(99), జేసన్‌ రాయ్‌ (55) అతడికి అండగా నిలిచారు. ఆంగ్లేయులు టీమ్‌ఇండియా బౌలింగ్‌ను చితకబాదేస్తున్నా హార్దిక్‌కు కోహ్లీ బంతినివ్వకపోవడం అందరినీ విస్మయపరిచింది.

‘మున్ముందు హార్దిక్‌ను ఫిట్‌గా ఉంచాల్సిన బాధ్యత మాపై ఉంది. అతడి బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌ను ఎక్కడ ఉపయోగించుకోవాలో మనం అర్థం చేసుకోవాలి. టీ20ల్లో అతడితో బౌలింగ్‌ చేయించాం. అయితే పనిభారాన్నీ పర్యవేక్షించాలి. అతడు ఫిట్‌గా బలంగా ఉండేలా మేం చూసుకోవాలి. ఎందుకంటే పాండ్య మా జట్టులో అత్యంత కీలకం’ అని కోహ్లీ అన్నాడు.

రెండో వన్డే ఓటమితో నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ రసవత్తరంగా మారిందని విరాట్‌ అంటున్నాడు. ఓపెనర్లు త్వరగా ఔటవ్వడంతో తమకు మంచి భాగస్వామ్యం అవసరమైందన్నాడు. కేఎల్‌, తాను ఆ పని చేశామని పేర్కొన్నాడు. రాహుల్‌ తన ఫామ్‌ కొనసాగించడం బాగుందన్నాడు. రిషభ్ మ్యాచ్‌ను మార్చేశాడని, హార్దిక్‌ ముగించాడని ప్రశంసించాడు. యువకులు ముందుకు రావడం ఆనందంగా ఉందన్నాడు. తాము మంచి లక్ష్యమే నిర్దేశించినా ఆ రోజు తమది కాదని అభిప్రాయపడ్డాడు.మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని