Team India: కోహ్లీసేనకు బుడగ నుంచి 20 రోజులు విముక్తి! - virat kohli team to get 20-day break from bio-bubble after wtc final
close
Published : 08/06/2021 20:52 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Team India: కోహ్లీసేనకు బుడగ నుంచి 20 రోజులు విముక్తి!

ముంబయి: ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న టీమ్‌ఇండియాకు శుభవార్త! ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ముగిశాక కొద్దిరోజులు వారు బయో బుడగకు దూరంగా ఉండొచ్చు. దాదాపుగా 20 రోజులు వారు బుడగను వీడొచ్చని తెలిసింది. మళ్లీ ఐదు టెస్టుల సిరీసు సమీపించగానే బుడగలో చేరాల్సి ఉంటుంది.

టీమ్‌ఇండియా ప్రస్తుతం సౌథాంప్టన్‌లో క్వారంటైన్‌లో ఉంది. జూన్‌ 18న న్యూజిలాండ్‌తో ఇక్కడే ఫైనల్లో తలపడుంది. జూన్‌ 24న ఆటగాళ్లు, కుటుంబ సభ్యులతో బ్రిటన్‌ మొత్తం పర్యటించేందుకు అవకాశం ఉందట. మళ్లీ జులై 14 బయో బుడగకు రావాల్సి ఉంటుంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసు ఆడాక నేరుగా ఐపీఎల్‌ బుడగకు వెళ్లొచ్చు.

‘న్యూజిలాండ్‌తో ఫైనల్‌ తర్వాత జూన్‌ 24న టీమ్‌ఇండియా బుడగ వీడుతుంది. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీసుకు సన్నద్ధమయ్యేందుకు జులై 14న శిబిరానికి చేరుతుంది. ఆగస్టు 4 నుంచి సిరీసు ఆడుతుంది. ఇక కుర్రాళ్లు బుడగను వీడి ఉపశమనం పొందొచ్చు. బ్రిటన్‌లో కేసుల సంఖ్య స్వల్పం. అలాగని కొవిడ్‌-19 ముప్పు పూర్తిగా తొలగిపోలేదని గ్రహించాలి’ అని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

‘ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు యూకేలో తిరగొచ్చు. అయితే ఎక్కడా చిక్కుకుపోకుండా ఉండేలా ప్రయాణ ప్రణాళికలు ఉంటాయి. జట్టు వేరే దేశానికి వెళ్లాక అక్కడ కేసులు పెరిగి ప్రయాణ ఆంక్షలు పెడితే ఎలా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యులు ఎక్కడైనా చిక్కుకుపోవాలని ఎవ్వరూ కోరుకోరు. అందుకే మేం బ్రిటన్‌లోని ప్రాంతాలపైనే దృష్టి సారిస్తాం’ అని ఆ వర్గాలు తెలిపాయి. విరాట్‌ కోహ్లీ సైతం బయటకెళ్లి, స్వేచ్ఛగా ఉండే అవకాశం వస్తే బాగుంటుందని కోరుకున్న సంగతి తెలిసిందే.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని