Virat Kohli: సౌథీ విషయంలో కోహ్లీ ఆలోచించాలి   - virat kohlis coach raj kumar sharma feels tim southee
close
Published : 08/06/2021 22:31 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Virat Kohli: సౌథీ విషయంలో కోహ్లీ ఆలోచించాలి 

భారత సారథిని పదిసార్లు ఔట్‌ చేసిన కివీస్‌ పేసర్‌..

ఇంటర్నెట్‌డెస్క్‌: న్యూజిలాండ్‌ పేసర్‌ టిమ్‌సౌథీ విషయంలో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ జాగ్రత్తగా ఉండాలని చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ హెచ్చరించారు. ఇదివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కివీస్‌ బౌలర్‌ చేతిలో విరాట్‌ సుమారు పదిసార్లు ఔటైన సందర్భాలు ఉండటంతో రాజ్‌కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఓ క్రీడాఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో కోహ్లీసేనకు సౌథీ నుంచి ప్రమాదం పొంచి ఉందన్నారు. కోహ్లీ తన పాత తప్పులను సరిదిద్దుకొని బాగా ఆడాలని రాజ్‌కుమార్‌ ఆకాంక్షించారు.

‘సౌథీ బౌలింగ్‌లో పదిసార్లు ఔటైనా కోహ్లీ తన తప్పులు తెలుసుకోలేదని కాదు. కానీ, అది కచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ విషయంపై అతడు దృష్టిసారిస్తాడని నేను కచ్చితంగా నమ్ముతున్నా. దాంతో ఆఫ్‌స్టంప్‌ ఆవల పడిన బంతుల్ని అలాగే వదిలిస్తాడని అనుకుంటున్నా. సౌథీ వేసే బంతుల్ని ముందే అంచనా వేయాలని, ఆడాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. అతడెంతో చక్కగా బౌలింగ్‌ చేస్తున్నాడు. బంతి కూడా బాగా స్వింగ్‌ అవుతుంది. ఇక పిచ్‌ కూడా అతడికి సహకరిస్తే ఆ బౌలింగ్‌ను ఎవరూ ఆడలేకపోవచ్చు’ అని రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు.

వాళ్లిద్దరి మధ్యా అండర్‌-19 స్థాయి నుంచే పోటీ ఉందని, సౌధీ న్యూజిలాండ్‌ తరఫున, కోహ్లీ భారత్‌ తరఫున అంతకుముందే ఆడారని రాజ్‌కుమార్‌ గుర్తుచేశారు. దాంతో అప్పటి నుంచీ కివీస్‌ పేసర్‌ టీమ్‌ఇండియా సారథి విషయంలో ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తున్నాడని చెప్పారు. అందువల్లే అతడి బౌలింగ్‌లో విరాట్‌ పదిసార్లు ఔటయ్యాడని అంచనా వేశారు. మరోవైపు కోహ్లీకి కవర్‌డ్రైవ్‌ షాట్‌ అంటే చాలా ఇష్టమని, ఆ షాట్‌ ఆడినప్పుడు చాలా సార్లు స్లిప్‌లో దొరికిపోయాడని, ఇప్పుడు అది ఆడాలంటే ఆలోచించాలని రాజ్‌కుమార్‌ హెచ్చరించారు. కాగా, ఇంకో పది రోజుల్లో భారత్‌, న్యూజిలాండ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో పోటీపడుతున్న సంగతి తెలిసిందే. అప్పుడు టీమ్‌ఇండియా సారథి శతకం సాధించాలని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.



మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని