‘విరాట పర్వం’ విడుదల వాయిదా - virataparavm post poned
close
Published : 14/04/2021 16:57 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

‘విరాట పర్వం’ విడుదల వాయిదా

ఇంటర్నెట్‌ డెస్క్‌: కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ దృష్ట్యా ఇప్పటికే పలు చిత్రాల విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. ‘లవ్‌ స్టోరీ’, ‘టక్‌ జగదీష్‌’ తర్వాత ఈ జాబితాలో నిలిచింది ‘విరాట పర్వం’. సామాజిక మాధ్యమాల వేదికగా సినిమా విడుదలని వాయిదా వేస్తున్నట్టు తెలియజేసింది చిత్ర బృందం. ‘కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ కారణంగా విరాటపర్వం చిత్ర విడుదలని వాయిదా వేస్తున్నాం. త్వరలోనే మరో విడుదల తేదీని ప్రకటిస్తాం. మాస్క్‌ ధరించండి.. జాగ్రత్తగా ఉండండి’ అని పేర్కొంది.

రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో వేణు ఊడుగుల తెరకెక్కించిన చిత్రమిది. నవీన్‌ చంద్ర, ప్రియమణి, నందితా దాస్‌, నివేదా పేతురాజ్‌, ఈశ్వరీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. సురేశ్‌ బొబ్బిలి సంగీతం అందించారు. ఎస్‌.ఎల్‌.వి. సినిమాస్‌ పతాకంపై నిర్మితమైన చిత్రం ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.

 
మరిన్ని


గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని