కరోనా బాధితులకు అండగా వీరూ ఫౌండేషన్‌ - virender sehwag foundation feeds 51000 covid-19 patients in delhi
close
Published : 16/05/2021 14:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కరోనా బాధితులకు అండగా వీరూ ఫౌండేషన్‌

ఇంటర్నెట్ డెస్క్‌: దేశంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో చాలామందికి సరైన వైద్యం, ఆహారం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న వారికి టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్ అండగా నిలుస్తున్నాడు.

దిల్లీలోని కరోనా బాధితులు, ఇతర అన్నార్థులకు పౌష్టికాహారాన్ని ఉచితంగా అందిస్తామని ఏప్రిల్ 25న ‘వీరేంద్ర సెహ్వాగ్‌ ఫౌండేషన్‌’ ట్విటర్ వేదికగా  ప్రకటించింది. అప్పటి నుంచి కొనసాగుతున్న ఈ ఫౌండేషన్‌ ఉచిత ఆహార పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 51 వేల మందికి ఉచితంగా ఆహార పదార్థాలను అందించినట్లు ఈ ఫౌండేషన్‌ తాజాగా ట్వీట్ చేసింది. ఎవరైనా ఆకలితో అలమటించినట్లయితే తమను సంప్రదించాలని కోరింది. ఇతర స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకుని అవసరమైన వారికి ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తోంది. తమకు సహాయం చేయాలనుకునేవారు virenderfoundation84@upiకి విరాళాలు అందించవచ్చని తెలిపింది.

ఇక, కరోనాపై జరుగుతున్న యుద్ధంలో దేశానికి అండగా ఉండేందుకు క్రీడాకారులు ముందుకువస్తున్నారు. విరుష్క జోడీ రూ.2కోట్ల విరాళం ప్రకటించడమే కాకుండా ప్రత్యేక కార్యక్రమం చేపట్టి రూ.11 కోట్ల విరాళాలను సేకరించింది. ఇప్పటికే  సచిన్‌ తెందూల్కర్‌, శిఖర్ ధావన్‌, యుజువేంద్ర చాహల్, రిషభ్ పంత్, జయదేవ్‌ ఉనద్కత్‌ విరాళాలు ప్రకటించారు.

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని