Vishal31: షూటింగ్‌ మొదలైంది - vishal new film started
close
Published : 07/05/2021 09:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Vishal31: షూటింగ్‌ మొదలైంది

ఇంటర్నెట్‌ డెస్క్‌: శరవణన్‌ దర్శకత్వంలో ఇటీవల ఓ చిత్రాన్ని ప్రకటించారు నటుడు విశాల్‌. హీరోగా ఆయన నటిస్తోన్న 31వ సినిమా ఇది. డింపుల్‌ హయాతీ నాయిక. ‘విశాల్ 31’ వర్కింగ్‌ టైటిల్‌తో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. గురువారం ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైనట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది చిత్ర బృందం.  కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ సాగిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర మోషన్‌ పోస్టర్‌ సినిమాపై ఆసక్తి పెంచుతోంది. నాట్‌ ఏ కామన్‌ పేరుతో విడుదల చేసిన ఆ వీడియోలో విశాల్‌ లుక్‌, సాంకేతి నిపుణుల వివరాలు కనిపిస్తాయి. తెలుగు, తమిళ భాషల్లో విడుదల ఏకకాలంలో విడుదల కానున్న ఈ సినిమాకి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. ఛాయాగ్రహణం: బాల సుబ్రహ్మణ్యం, కూర్పు: ఎన్‌.బి. శ్రీకాంత్‌, కళ: ఎస్‌.ఎస్‌. మూర్తి. త్వరలోనే టైటిల్‌ని ప్రకటించనున్నారు. మరోవైపు ఆర్యతో కలిసి ‘ఎనిమీ’లో నటిస్తున్నారు విశాల్‌.
 




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని