పవన్‌-రానాతో వినాయక్‌..! - vv vinayak in pspk rana movie
close
Published : 08/02/2021 11:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పవన్‌-రానాతో వినాయక్‌..!

అయ్యప్పనుమ్ కోషియం రీమేక్‌లో మరో డైరెక్టర్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో ఓ సరికొత్త చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. మలయాళీ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియం’కు రీమేక్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో రానున్న ఈ సినిమాలో ఇప్పటికే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ భాగమయ్యారు. ఈ చిత్రానికి ఆయన మాటల రచయితగా వ్యవహరించనున్నారు.

కాగా, తాజా సమాచారం ప్రకారం పవన్‌, రానా మూవీలో మరో పవర్‌ఫుల్‌ డైరెక్టర్‌ భాగం కానున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఫ్యాక్షన్‌, యాక్షన్‌ చిత్రాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా చెప్పుకునే వి.వి.వినాయక్‌ త్వరలోనే ఈ చిత్రబృందంలో ఓ సభ్యుడు కానున్నారట. ఈ సినిమాలో ఆయన ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారట. ఈ మేరకు సోషల్‌మీడియాలో ప్రచారం సాగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు వి.వి.వినాయక్‌ ‘శీనయ్య’ అనే చిత్రంతో కథానాయకుడిగా తొలి అడుగు వేశారు. దీనితోపాటు ఆయన డైరెక్టర్‌గా ‘ఛత్రపతి’ బాలీవుడ్‌ రీమేక్‌ను తెరకెక్కించనున్నారు.

ఇదీ చదవండి

మళ్లీ.. మళ్లీ.. అందాలు జల్లి
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని