#NTR30: హీరోయిన్‌ ఈమేనా? - warina hussain in talks for ntr 30
close
Published : 30/01/2021 15:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

#NTR30: హీరోయిన్‌ ఈమేనా?

బీటౌన్ నుంచి ల్యాండైన మరో ముద్దుగుమ్మ

హైదరాబాద్‌: బాలీవుడ్‌ ముద్దుగుమ్మలు అలియాభట్‌, సయీ మంజ్రేకర్‌ ఇప్పటికే టాలీవుడ్‌లో అవకాశాలు సొంతం చేసుకుని తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధం కాగా ఇప్పుడు మరో బ్యూటీ నగరంలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది. తారక్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. ‘అరవింద సమేత’ తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో #NTR30 గురించి సినీ ప్రేక్షకులు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రానికి సంబంధించి ఓ విషయం ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లుకొడుతోంది.

అతి త్వరలో రెగ్యులర్‌ షూట్‌ జరుపుకోనున్న ఈ సినిమాలో ‘లవ్‌యాత్రి’తో మెప్పించిన బాలీవుడ్‌ నటి వరీన హుస్సేన్‌ అవకాశం దక్కించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టెస్ట్‌ షూట్‌ కోసం ఆమె ఇటీవల హైదరాబాద్‌లో ల్యాండ్‌ అయినట్లు ఇండస్ట్రీలో టాక్‌ వినిపిస్తోంది. ఆమె నటన పట్ల త్రివిక్రమ్‌ సుముఖత వ్యక్తం చేశారని దీంతో ఆమెకు ఈ సినిమాలో ఓ పాత్రను ఇచ్చారని నెట్టింట్లో చెప్పుకుంటున్నారు. సెకండ్‌ హీరోయిన్‌గా ఆమె కనిపించే అవకాశం ఉన్నట్లు భోగట్టా. మరోవైపు ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ పనుల్లో బిజీగా ఉండగా.. త్రివిక్రమ్‌ సైతం పవన్‌, రానా సినిమాకి మాటలు అందిస్తున్నారు.

ఇదీ చదవండి

అందరూ వచ్చారు కానీ వీళ్లే ఆగిపోయారు




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని