థ్యాంక్యూ సర్‌..ఇలానే ఆడతాం: సుందర్‌ - washington sundar thanks anand mahindra for thar suv humbled by your gift
close
Published : 30/01/2021 00:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

థ్యాంక్యూ సర్‌..ఇలానే ఆడతాం: సుందర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాకు టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్‌ సుందర్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రోత్సహిస్తూ, మద్దతుగా నిలవడంతో పాటు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినందుకు ట్విటర్‌లో ధన్యవాదాలు చెప్పాడు. ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్‌ విజయం సాధించిన అనంతరం ఆరుగురు భారత యువ ఆటగాళ్లకు ఆనంద్ మహీంద్రా ‘థార్‌ ఎస్‌యూవీ’ కార్లను బహుమతిగా ఇచ్చిన సంగతి తెలిసిందే. సుందర్‌తో పాటు శార్దూల్ ఠాకూర్‌, మహ్మద్‌ సిరాజ్‌, శుభ్‌మన్‌ గిల్‌, నవదీప్‌ సైని, టి.నటరాజన్‌లకు కార్లను ఇచ్చాడు.

ఈ సందర్భంగా మహీంద్రాకు సుందర్ కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేశాడు. ‘‘ఆనంద్ మహీంద్రా సర్‌.. మీరు గిఫ్ట్‌ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా యువకులకు ఇస్తున్న ప్రోత్సాహం, మద్దతుకు ధన్యవాదాలు. మా అత్యుత్తమ ప్రదర్శనను ఇలానే కొనసాగిస్తాం’’ అని పేర్కొన్నాడు. ప్రధాన ఆటగాళ్లు జట్టుకు దూరమైనా భారత యువ ఆటగాళ్లు అద్భుత పోరాటంతో ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాపై టీమిండియా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సుందర్‌ ఆల్‌రౌండర్‌ ప్రదర్శనతో అదరగొట్టాడు. అర్ధశతకం సాధించడంతో పాటు నాలుగు వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 186/6తో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు శార్దూల్‌తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పాడు.

ఇవీ చదవండి

వారెవ్వా..సూపర్‌మ్యాన్‌ క్యాచ్ ఇది!

సంకల్పం ఉంటే ఏదైనా చేయొచ్చు: కోహ్లీమరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని